రేషన్ దుకాణాల ద్వారానే సరుకులు పంపిణీ
రేషన్ దుకాణాల ద్వారానే సరుకులు పంపిణీ చిత్రం న్యూస్, పెద్దాపురం: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జూన్ 1 నుంచి రేషన్ కార్డు దారులకు రేషన్ దుకాణాల ద్వారానే సరుకులు పంపిణీ చేయనున్నందున కార్డు దారులు రేషన్ దుకాణాల వద్దకే వెళ్లాలని సామర్లకోట తహసీల్దార్ కొవ్వూరి చంద్ర శేఖర రెడ్డి చెప్పారు. శుక్రవారం సామర్లకోట తహసీల్దార్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో తహసీల్దార్ మాట్లాడుతూ.. ఎండీయు వాహనాల ద్వారా రేషన్ సరుకులు పంపిణీ ప్రక్రియలో పీడీఎస్ బియ్యం పక్కదారి పడుతుందని...