Chitram news
Newspaper Banner
Date of Publish : 26 May 2025, 7:30 am Editor : Chitram news

సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి
*బిపి షుగర్ వ్యాధులకు ఉచితంగా మందుల పంపిణీ.

*బొమ్మనపల్లి మెడికల్ ఆఫీసర్ గిరిజశ్రీ

చిత్రం న్యూస్, చిగురుమామిడి:
వర్షాకాలం ప్రారంభమవుతున్నందున సీజనల్ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని, అప్రమత్తంగా ఉండాలని కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం బొమ్మనపల్లి పీ హెచ్ సీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ గిరిజశ్రీ అన్నారు. సోమవారం బొమ్మనపల్లి గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వారు మాట్లాడారు. నిల్వ ఉన్న నీటిలో దోమలు పెరిగి డెంగ్యూ వంటి విష జ్వరాలు వచ్చే ప్రమాదం ఉందని,పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. బీపీ, షుగర్ వ్యాధులకు ప్రభుత్వం మందులు ఉచితంగానే అందిస్తుందని, ప్రైవేటు లో మందులు కొనుక్కోని నష్టపోవద్దన్నారు. కరోనా వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. గ్రామంలో అభా కార్డ్స్ ల రిజిస్ట్రేషన్ ప్రతి ఒక్కర చేయించుకోవాలని, మహిళలకు ప్రత్యేకంగా ఆరోగ్య మహిళ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వారికి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచిత మందులు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. గ్రామంలో ఎవరికైనా జ్వరాలు వస్తే తమకు వెంటనే సమాచారం అందించాలన్నారు.