Chitram news
Newspaper Banner
Date of Publish : 25 May 2025, 2:09 pm Editor : Chitram news

భక్తులతో కిటకిటలాడిన ఓదెల మల్లన్న ఆలయం

భక్తులతో కిటకిటలాడిన ఓదెల మల్లన్న ఆలయం.

*భక్తులకు అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు పూర్తి చేసిన ఆలయ ఈవో సదయ్య

చిత్రం న్యూస్, ఓదెల:
ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఓదెల శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం భక్తులతో కిటకిటలాడింది. దూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చలువ పందిర్లు, మంచినీటి సౌకర్యం ఇతరత్ర పూర్తి ఏర్పాట్లు ఆలయ కార్య నిర్వహణ అధికారి బి. సదయ్య ఏర్పాట్లు చేశారు. భక్తులు మల్లికార్జున స్వామిని దర్శించుకుని గుడి ముందర పట్నం వేసి బోనం చెల్లించారు. కోరిన కోరికలు తీర్చే ఆ మల్లికార్జునుడు స్వామిని వేడుకున్నారు. ఆదివారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు.