Chitram news
Newspaper Banner
Date of Publish : 25 May 2025, 12:31 pm Editor : Chitram news

నకిలీ పత్తి విత్తనాలు అమ్మిన వారిపై పీడీ యాక్ట్ నమోదు చేయాలి*

నకిలీ విత్తనాలు అమ్మిన వారిపై పీడీ యాక్ట్ నమోదు చేయాలి 
*రైతు స్వరాజ్య వేదిక జిల్లా అధ్యక్షుడు సంగెపు బొర్రన్న
చిత్రం న్యూస్, ఇచ్చోడ: మారుమూల గ్రామాల్లో అమాయక రైతులను నమ్మంచి నకిలీ పత్తి విత్తనాలు అంటగట్టిన వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని రైతు స్వరాజ్య వేదిక జిల్లా అధ్యక్షులు సంగెపు బొర్రన్న అన్నారు. సంక్షోభంతో కూడుకున్న వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించకుండా, మండల కేంద్రాలల్లోని మార్కెటింగ్ చేస్తున్న గ్రామీణ ప్రాంతంలో ఉన్న సబ్ డీలర్లు కలిసి రైతులకి అప్పురూపేణా కొంత వరకు ఆర్థిక సహాయం చేస్తూ చాటు మాటున మారుమూల గ్రామీణ అమాయక రైతులను ఆసరాగా చేసుకొని నకిలీ పత్తి విత్తనాలు అంటగడుతున్న దృశ్యాలు జిల్లాలో కోకొల్లలుగా ఉన్నాయ ని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామీణ ప్రాంతాల్లోని సబ్ డీలర్లపైనా నిఘా పెట్టవలసిన అవసరం ఉందని ఆయన అన్నారు.
ప్రదానంగా వ్యవసాయ శాఖ అధికారుల నిర్లక్ష్యం మూలంగానే నకిలీ పత్తి విత్తనాలు మార్కెట్లో విచ్చలవిడిగా అమ్ముడు పో తున్నాయన్నారు.
నకిలీ పత్తి విత్తనాలు అమ్ముతున్న వారిపై నిఘా పెట్టి విజిలెన్స్ అధికారులు నిఘా పెట్టాలన్నారు. నకిలీ పత్తి విత్తనాలు అమ్మిన వారిపై పీడీ యాక్ట్ ని నమోదు చేసి, ఎవరు నకిలీ విత్తనాలు అమ్మకుండా చూడవలసిన అవసరం ఉందన్నారు. రైతులు అనిల్, మోహన్, మాణిక్ రావ్ sk సలీమ్, తదితరులు ఉన్నారు.