హనుమంతుడి సింధూర పూజ కథ*
హనుమంతుడి సింధూర కథ చిత్రం న్యూస్, ఆదిలాబాద్: హనుమంతుడి ఆలయాల్లో స్వామికి సింధూరాన్ని అలంకరించడం, భక్తులు దాన్నే బొట్టుగా పెట్టుకోవడం చూస్తుంటాం. మారుతికి సింధూరాన్ని అర్పిస్తే కోరిన కోర్కెలు నెరవేరుతాయనే నమ్మకమూ ఉంది. సూటిగా చెప్పాలంటే ఒక్క హనుమాన్ ఆలయాల్లోనే కాషాయ రంగు సింధూరం కనిపిస్తుంది. అసలు, స్వామికి కుంకుమ బదులు సింధూరాన్ని అర్పించడం వెనుక చిన్న కథే ఉంది. హనుమంతుడు సీతాదేవి జాడ తెలుసుకునేందుకు లంకలోని అశోకవనానికి చేరుకున్నప్పుడు... వెంటనే సీతమ్మ దగ్గరకు వెళ్లలేదట. కాసేపు...