Chitram news
Newspaper Banner
Date of Publish : 20 May 2025, 6:50 am Editor : Chitram news

బొమ్మనపల్లిలో అగ్నిప్రమాదం

చిత్రం న్యూస్, చిగురుమామిడి,
కరీంనగర్ జిల్లా చిరుగుమామిడి మండలం బొమ్మనపల్లి గ్రామంలో సోమవారం అర్ధరాత్రి సమయంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే బొమ్మనపల్లి గ్రామానికి చెందిన ముత్యాల కొమురయ్య తండ్రి బక్కయ్య ( 42) అనే రైతుకు చెందిన వ్యవసాయ బావి వద్ద సోమవారం అర్ధరాత్రి సమయంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. రైతు కొమురయ్య పశువుల పాక ముందు వెళ్తున్న 11కే వీ విద్యుత్ వైర్లు ఒకదానికొకటి తాకడంతో మంటలు చెలరేగి పక్కనే ఉన్న పశువులపాక అంటుకొని, 1200 గడ్డి కట్టలు దగ్ధమయ్యాయని తెలిపాడు. ఈ ప్రమాదంలో ఆవు తీవ్రంగా గాయపడింది. డ్రిప్ వైర్లు ,టార్ఫాలిన్ కవర్లు పూర్తిగా కాలిపోయాయి. పశువులపాక కూడా కాలిపోయింది. రైతు కొమరయ్య అగ్నిమాపక  సిబ్బందికి సమాచారం అందించడంతో వెంటనే ఘటన స్థలానికి చేరుకొని మంటలను అర్పారు. ఈ ప్రమాదంలో 5.0లక్షల వరకు నష్టపోయానని రైతు వాపోయాడు. ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని వేడుకున్నాడు.