మహిమాన్విత పుణ్యక్షేత్రం జైనథ్ దేవాలయం
జై జై శ్రీమన్నారాయణ చిత్రం న్యూస్, ఆదిలాబాద్; శ్రీలక్ష్మీనారాయణ ! లీలాయుత భక్తలోల ! ప్రియ పరిపాలా ! త్రైలోక్యధామ ! రక్షక ! పాలించగ దయను జూపు పావన చరితా ! తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్ జిల్లా పేరు వినగానే మొదట గుర్తుకొచ్చేది అతి ప్రాచీన మహిమాన్విత పుణ్యక్షేత్రం జైనథ్ మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి ఆలయం. 12వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని అష్ట కోణాకృతిలో జైనులు నిర్మించారు. నల్ల రాయితో నిర్మించిన ఈ...