Chitram news
Newspaper Banner
Date of Publish : 02 November 2026, 12:38 pm Editor : Chitram news

భీంపూర్ పోలీసు స్టేషన్ ను తనిఖీ చేసిన డీఎల్ఎస్ఏ కార్యదర్శి హుస్సేన్ 

చిత్రం న్యూస్, భీంపూర్: ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ పోలీసు స్టేషన్ ను సీనియర్ సివిల్ జడ్జి, డీఎల్ఎస్ఏ కార్యదర్శి బి.హుస్సేన్ సోమవారం ఉదయం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ తనిఖీలో పోలీస్ స్టేషన్ ఆవరణలో ఉచిత న్యాయ సేవల గురించి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ పంపిణీ చేసిన సమాచార సూచికలు ఏర్పాట్లు చేయక పోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి వెంట లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ అరుగుల అశోక్, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ ఉమేష్ రావు డోలే, బార్ అసోసియేషన్ కార్యదర్శి కేమ శ్రీకాంత్ తదితరులు ఉన్నారు.