Chitram news
Newspaper Banner
Date of Publish : 29 October 2026, 5:24 pm Editor : Chitram news

ఆపదలో ఉన్న కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటా- సామాజిక కార్యకర్త ముడుపు మౌనిష్ రెడ్డి

చిత్రం న్యూస్, భీంపూర్: ఆపదలో ఉన్న కుటుంబాలకు నేనున్నానని, వారిని అన్ని విధాలుగా ఆదుకుంటానని సామాజిక కార్యకర్త ముడుపు మౌనిష్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం భీంపూర్ మండలం పిప్పలకోటి కి చెందిన యువకులు మౌనిష్ రెడ్డి సైన్యంలో చేరగా.. వారికి కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన, రోడ్డు ప్రమాదంలో గాయపడిన కుటుంబాలకు ఆర్థిక సహాయాన్ని అందించామన్నారు. అలాగే గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నయువత తన దృష్టికి తీసుకురావాలని అన్నారు.సేవా కార్యక్రమాలను మరింత విస్తరిస్తామని పేర్కొన్నారు. సమాజ సేవ కోసం తాపత్రయం ఉన్నవారు తమతో కలిసి రావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో గ్రామస్తులు మెట్పెల్లి వెంకట్ రెడ్డి, కడదారపు అశోక్, పిట్ల శ్రీనివాస్, నవీన్, రాజలింగం,ఇంజాపూర్ రాములు, షేక్ రంజాన్, రాంచందర్ రెడ్డి తదితరులు ఉన్నారు.