మినీ గురుకులంలో ప్రవేశాలకు దరఖాస్తులు
మినీ గురుకులంలో ప్రవేశాలకు దరఖాస్తులు చిత్రం న్యూస్,బేల: మండలంలోని సదల్‌పూర్ గ్రామంలో ఉన్న మినీ గురుకులం (బాలికలు)లో 2026-27 విద్యా సంవత్సరానికి మిగిలిన సీట్ల భర్తీకి ఎస్టీ బాలికల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు లైసన్ ప్రిన్సిపాల్ కమ్ డీసీఓ అనిల్ కాంబ్లే, ప్రధానోపాధ్యాయురాలు డి. మానస తెలిపారు. ఒకటి, ఐదో తరగతుల్లో ప్రవేశాలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు. ఒకటో తరగతిలో చేరేందుకు కనీసం ఐదేళ్ల వయస్సు పూర్తయి ఉండాలని, పీవీటీజీ అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యం ఇస్తామని వెల్లడించారు. దరఖాస్తు...