మినీ గురుకులంలో ప్రవేశాలకు దరఖాస్తులు
చిత్రం న్యూస్,బేల: మండలంలోని సదల్‌పూర్ గ్రామంలో ఉన్న మినీ గురుకులం (బాలికలు)లో 2026-27 విద్యా సంవత్సరానికి మిగిలిన సీట్ల భర్తీకి ఎస్టీ బాలికల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు లైసన్ ప్రిన్సిపాల్ కమ్ డీసీఓ అనిల్ కాంబ్లే, ప్రధానోపాధ్యాయురాలు డి. మానస తెలిపారు. ఒకటి, ఐదో తరగతుల్లో ప్రవేశాలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు. ఒకటో తరగతిలో చేరేందుకు కనీసం ఐదేళ్ల వయస్సు పూర్తయి ఉండాలని, పీవీటీజీ అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యం ఇస్తామని వెల్లడించారు. దరఖాస్తు చేసుకునే వారు ఆధార్, జనన, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, రేషన్ కార్డు, రెండు పాస్‌పోర్టు సైజు ఫొటోలు సమర్పించాలన్నారు. ఈ నెల 31 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని, నవంబరు 5న లాటరీ ద్వారా ఎంపిక, 8న ప్రవేశాలు చేపడతామని తెలిపారు. వివరాలకు 8096115581, 9346879181 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.