Chitram news
Newspaper Banner
Date of Publish : 25 October 2026, 5:37 pm Editor : Chitram news

మేజర్ పత్తి రకంపై వ్యవసాయ క్షేత్ర ప్రదర్శన

 మేజర్ పత్తి రకంపై వ్యవసాయ క్షేత్ర ప్రదర్శన

చిత్రం న్యూస్ బేల: ఆదిలాబాద్ జిల్లా బేల మండలం సాంగిడి గ్రామంలో ఆధునిక పత్తి వంగడాలపై రైతులకు అవగాహన కల్పించే కార్యక్రమంలో భాగంగా పాలమూర్ సీడ్స్ ఆధ్వర్యంలో పాలమూరు మేజర్ పత్తి రకంపై క్షేత్ర ప్రదర్శన నిర్వహించారు. రైతు భోయర్ సునీల్ చేనులో ఏర్పాటు చేసిన ప్రదర్శన క్షేత్రాన్ని రైతులు పరిశీలించారు. ఈ సందర్భంగా మేజర్ పత్తి రకం ప్రత్యేకాలు సాగు విధానం దిగుబడి సామర్థ్యం తదితర అంశాలపై అవగాహన కల్పించారు. పాలమూరు సీడ్స్ ఎస్ఓ ఉమాకాంత్ రెడ్డి మాట్లాడుతూ..పాలమూరు మేజర్ పత్తి రకం తక్కువ కాలంలో పంట చేతికి రావడంతోపాటు అధిక దిగుబడి అనుకూలంగా ఉంటుందని తెలిపారు. పచ్చ దోమ, తెల్ల దోమ వంటి రసం పీల్చే పురుగులను తట్టుకునే సామర్ధ్యం ఈ రకానికి ఉంటుందన్నారు. రెండో పంట వేసేందుకు ఉపయోగకరంగా ఉండడానికి వివరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఓ ఉమాకాంత్ రెడ్డి, ఎండీఓ రామన్న, ఫీల్డ్ స్టాఫ్ ప్రఫుల్ గౌడ్, రైతులు పాల్గొన్నారు.