బేలలో ఘనంగా మహిళల కుంకుమార్చన
బేలలో ఘనంగా మహిళల కుంకుమార్చన కిటకిటలాడిన మండపం చిత్రం న్యూస్, బేల: ఆదిలాబాద్ జిల్లా బేల మండల కేంద్రంలోని అశోక్ నగర్ కాలనీలో కుంకుమార్చన కార్యక్రమం శుక్రవారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాలనీతో పాటు పరిసర ప్రాంతాలకు చెందిన మహిళలు పెద్ద సంఖ్యలో హాజరుకావడంతో మండపం మహిళలతో కిటకిటలాడింది. ఈ సందర్భంగా మహిళలు భక్తిపారవశ్యంతో అమ్మవారికి కుంకుమార్చనలు నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి నామస్మరణలు, భక్తి గీతాలతో మండపం ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది....