గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం- ఎమ్మెల్యే పాయల్ శంకర్
చిత్రం న్యూస్, ఆదిలాబాద్ రూరల్: గిరిజన గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. శుక్రవారం ఆదిలాబాద్ రూరల్ మండలంలోని పలు గిరిజన గ్రామాల్లో పర్యటించిన ఎమ్మెల్యే, SDF నిధులతో చేపట్టనున్న కమ్యూనిటీ షెడ్ల నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. చించుఘాట్, పందిరిలోద్ది, అంకాపూర్, లోహారా, తిప్పా గ్రామాల్లో రూ. 5 లక్షల చొప్పున, హట్టిగుట్టలో రూ. 5 లక్షలు, లింగుగూడలో రూ. 25 లక్షలు కలిపి మొత్తం రూ. 55 లక్షల విలువైన అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే పాయల్ శంకర్ భూమిపూజ చేసి పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రూరల్ మండల అధ్యక్షుడు దయాకర్, గ్రామ పటేళ్లు, సర్పంచులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.