గిమ్మలో లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల పత్రాల పంపిణీ
చిత్రం న్యూస్, భోరజ్: భోరజ్ మండలం గిమ్మ గ్రామంలో శనివారం ఇందిరమ్మ ఇళ్ల పత్రాల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. గ్రామంలోని అర్హులైన పేద లబ్ధిదారులకు స్థానిక సర్పంచ్ గాజుల ప్రద్యుమ్న, జిల్లా డీసీసీ వైస్ ప్రెసిడెంట్ దీపక్ రావు చేతుల మీదుగా ఇళ్ల పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు చేరవేయడమే తమ లక్ష్యమని, నిరుపేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు ప్రభుత్వం పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేసిందని తెలిపారు. మిగిలిన అర్హులకు కూడా త్వరలోనే పథకాలు అందేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. సొంతింటి పత్రాలు అందడంతో లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు, అధికారులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.