Chitram news
Newspaper Banner
Date of Publish : 30 September 2026, 12:22 pm Editor : Chitram news

ఆదిలాబాద్ జిల్లాలో కౌశల్ బోధ్ శిక్షణ ప్రారంభం

ఆదిలాబాద్ జిల్లాలో కౌశల్ బోధ్ శిక్షణ ప్రారంభం

చిత్రం న్యూస్, ఆదిలాబాద్:  జిల్లాలో మూడు రోజుల కౌశల్ బోధ్ శిక్షణ మంగళవారం ప్రారంభమైంది. ఈ నెల 29, 30 మరియు అక్టోబర్ 1వ తేదీ వరకు ఈ శిక్షణా కార్యక్రమం కొనసాగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా విద్యాధికారి (DEO) మాధవి, AMO లక్ష్మణ్ హాజరయ్యారు. జిల్లా వ్యాప్తంగా వివిధ పాఠశాలల నుండి 135 మంది ఒకేషనల్ ట్రైనర్లు, గణిత, సామాన్య శాస్త్రం, సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు ఈ శిక్షణకు హాజరయ్యారు. NEP-2020, NCF-2023 మార్గదర్శకాల ప్రకారం ఈ శిక్షణ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. 6 నుండి 8వ తరగతి విద్యార్థులకు నైపుణ్య విద్యలో ఈ శిక్షణ కీలక పాత్ర పోషించనుందని వొకేషనల్ ట్రైనర్ల జిల్లా అధ్యక్షులు సయ్యద్ సబ్దర్ అజీజ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో DRPలుగా తొడసం సాయి ఈశ్వర్, బి.అన్వేష్, రాజు రెడ్డి, మొహమ్మద్ కలీం, రవి వ్యవహరించారు.