Chitram news
Newspaper Banner
Date of Publish : 28 September 2026, 4:16 pm Editor : Chitram news

జైనథ్ లో అంగన్‌వాడీ టీచర్లకు సన్మానం

జైనథ్ లో అంగన్‌వాడీ టీచర్లకు సన్మానం

చిత్రం న్యూస్, జైనథ్: ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండల కేంద్రంలోl నిర్వహించిన సేవ సంకల్ప అభియాన్ కార్యక్రమంలో భాగంగా అంగన్‌వాడీ టీచర్లను ఘనంగా సన్మానించారు. ఆదిలాబాద్ లోకసభ సభ్యుడు గోడం నగేష్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పతంగే బ్రహ్మానంద్, జిల్లా మహిళా మోర్చ జిల్లా అధ్యక్షురాలు సుమ, దోని జ్యోతి కలిసి అంగన్‌వాడీ కార్యకర్తలకు శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. సమాజంలో అంగన్‌వాడీ టీచర్లు అందిస్తున్న సేవలు ఎంతో అమూల్యమైనవని కొనియాడారు. గర్భిణులు, బాలింతలు, చిన్న పిల్లల ఆరోగ్య సంరక్షణలో వారి పాత్ర కీలకమన్నారు. నిరంతరం నిస్వార్థంగా సేవలందిస్తున్న వారి శ్రమను గుర్తించి అభినందించడం అందరి బాధ్యత అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక జిల్లా బీజీపీ మహిళ మోర్చ ఉపాధ్యక్షురాలు దివ్య, బీజేపీ నాయకులు రమేష్ రెడ్డి, రాకేష్ రెడ్డి, సూర్య రెడ్డి, సిడం రాకేష్, విశాల్ ,అశోక్, అంగన్‌వాడీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.