Chitram news
Newspaper Banner
Date of Publish : 28 September 2026, 3:36 pm Editor : Chitram news

బాసర గోదావరి నది బ్రిడ్జిపై యువకుడు హల్‌చల్ 

బాసర గోదావరి నది బ్రిడ్జిపై యువకుడు హల్‌చల్ 

చిత్రం న్యూస్, బాసర : నిర్మల్ జిల్లా బాసర గోదావరి నది బ్రిడ్జిపై నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలానికి చెందిన నవీన్ అనే యువకుడు తీవ్ర హల్‌చల్ చేశాడు. ఇంటి వద్ద బైక్ కొనివ్వాలని గొడవపడి, బ్రిడ్జి పైనుంచి గోదావరి నదిలోకి దూకి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తూ పరుగులు తీసి అందరినీ ఆందోళనకు గురిచేశాడు. ​అక్కడ విధులు నిర్వహిస్తున్న వాగ్దేవి లేబర్ కాంట్రాక్ట్, బోటింగ్ సిబ్బంది, పోలీసులు వెంటనే స్పందించారు. బైకు కొనిస్తామని హామీ ఇచ్చి, ఉపాయంతో ఆ యువకుడిని అదుపులోకి తీసుకుని గోదావరి నదిలో పడకుండా కాపాడారు. అనంతరం అతడిని కుటుంబ సభ్యులకు సురక్షితంగా అప్పగించారు. యువకుడి ప్రాణాలను కాపాడటంలో సమయస్ఫూర్తిగా వ్యవహరించిన వాగ్దేవి లేబర్ కాంట్రాక్ట్ సిబ్బంది గణపతి, శ్రీనివాస్, బోటింగ్ సిబ్బంది గంగాధర్, నరేష్, సతీష్లతో పాటు పోలీస్ సిబ్బందిని పలువురు అభినందించారు.