Chitram news
Newspaper Banner
Date of Publish : 24 September 2026, 9:43 pm Editor : Chitram news

బాసర గోదావరిలో మునిగి యువకుడు మృతి

బాసర గోదావరిలో మునిగి యువకుడు మృతి

చిత్రం న్యూస్, బాసర : నిర్మల్ జిల్లా బాసర గోదావరిలో వినాయక నిమజ్జనం కోసం వచ్చి ప్రమాదవశాత్తు నదిలో మునిగి ఓ యువకుడు మృతి చెందిన విషాద సంఘటన బాసరలో  చోటుచేసుకుంది. సీఐ దీపక్ తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం మధ్యాహ్నం సమయంలో  మండలంలోని ఎల్వి గ్రామానికి చెందిన లోకండే విశాల్ (25) గ్రామస్థులతో కలిసి ప్రతిమల నిమజ్జనం కోసం బాసరలోని గోదావరి నదికి వచ్చాడు. నిమజ్జన కార్యక్రమం పూర్తయిన తర్వాత అందరూ కలిసి భోజనం చేయడం కోసం సత్రానికి వెళ్లారు. ​ఆ సమయంలో విశాల్ ‘మళ్లీ స్నానం చేసి వస్తాను’ అని చెప్పి ఒక్కడే తిరిగి గోదావరి నది వద్దకు వెళ్లాడు. స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు నది నీటిలో మునిగిపోయి ప్రాణాలు కోల్పోయాడు. మృతుని తల్లి లోకండే కమలాబాయి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. యువకుడి అకాల మరణంతో ఎల్వి గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలముకున్నాయి.