Chitram news
Newspaper Banner
Date of Publish : 23 September 2026, 10:22 am Editor : Chitram news

అబ్దుల్లాపూర్ ‘మోక్ష గణపతి’కి పూజలు:

  అబ్దుల్లాపూర్ ‘మోక్ష గణపతి’కి పూజలు:

* 40 ఏళ్లుగా గ్రామంలో ఒక్కటే విగ్రహం.. ప్రత్యేక విశిష్టత

చిత్రం న్యూస్, బాసర : నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం అబ్దుల్లాపూర్ గ్రామంలో వేంచేసి ఉన్న ప్రముఖ మోక్ష గణపతి (కర్ర వినాయకుడు) ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఊరంతా కలసి ఒకే ఒక్క గణనాథుడి విగ్రహాన్ని ప్రతిష్టించి పూజించడం ఇక్కడి ప్రధాన ప్రత్యేకత.  గత 40 సంవత్సరాల నుండి కొలువుదీరి భక్తులను దర్శనం ఇస్తున్నారు  ​పర్యావరణ హితం – కర్ర విగ్రహం ఎలాంటి ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (PoP) లేదా రసాయన రంగులు ఉపయోగించకుండా, సాంప్రదాయ పద్ధతిలో చెక్కతో రూపొందించిన కర్ర గణపతి విగ్రహాన్ని ఇక్కడ పూజిస్తారు. ఒకే ఊరు ఒకే గణపతి గ్రామంలో వేర్వేరుగా మండపాలు ఏర్పాటు చేయకుండా, ఊరి ప్రజలందరూ ఏకమై ఈ మోక్ష గణపతి వద్దనే పూజా కార్యక్రమాలు నిర్వహించి ఐక్యతను చాటుతున్నారు.

​ముడుపులు, విశేష నమ్మకం: సంతాన ప్రాప్తి, ఆరోగ్యం, ఇంట అష్టైశ్వర్యాల కోసం దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు స్వామివారికి ముడుపులు కట్టి తమ కోరికలను నివేదించుకుంటున్నారు.

​నిమజ్జనంలో ప్రత్యేకత: 11 రోజుల నవరాత్రి ఉత్సవాల అనంతరం ప్రధాన కర్ర విగ్రహాన్ని నిమజ్జనం చేయకుండా తిరిగి ఆలయంలో భద్రపరుస్తారు. స్వామివారి తోడుగా ఉంచిన మట్టి విగ్రహాన్ని మాత్రమే శాస్త్రోక్తంగా నిమజ్జనం చేయడం ఇక్కడి ఆచారం.  ఇటీవల ప్రజాప్రతినిధులు, చుట్టుపక్కల గ్రామాల నుంచి తరలివచ్చిన వేలాది మంది భక్తులు మోక్ష గణపతిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆధ్యాత్మికతతో పాటు పర్యావరణ పరిరక్షణకు సందేశమిస్తున్న అబ్దుల్లాపూర్ మోక్ష గణపతి ఉత్సవాలు జిల్లాలోనే ప్రత్యేక గుర్తింపు పొందాయి. ప్రతిరోజు అన్నదాన ప్రసాదం స్వీకరిస్తారు,