ఆదిలాబాద్ జిల్లాలో 3 రోజులు మద్యం అమ్మకాలు బంద్
ఆదిలాబాద్ జిల్లాలో 3 రోజులు మద్యం అమ్మకాలు బంద్ చిత్రం న్యూస్, ఆదిలాబాద్: వినాయక నిమజ్జనం సందర్భంగా శాంతి భద్రతల దృష్ట్యా జిల్లాలో మద్యం దుకాణాలను మూసివేయాలని కలెక్టర్ రాజర్షి షా ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన ఆదేశాల మేరకు సెప్టెంబర్ 21 సాయంత్రం 6 గంటల నుండి 23 సాయంత్రం 6 గంటల వరకు ఆదిలాబాద్ టౌన్, రూరల్, మావల తదితర మండలాల్లో బార్లు, వైన్ షాపులు, కల్లు దుకాణాలు, మూసివేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.