Chitram news
Newspaper Banner
Date of Publish : 20 September 2026, 7:02 pm Editor : Chitram news

జైనథ్‌లో మాదిగ జాగృతి సంఘం సమీక్షా సమావేశం

జైనథ్‌లో మాదిగ జాగృతి సంఘం సమీక్షా సమావేశం

గ్రామ కమిటీల ఏర్పాటు.. జాతి ఐక్యతకు నాయకుల పిలుపు

చిత్రం న్యూస్, జైనథ్: మాదిగ జాగృతి సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ విశారదన్ మహారాజ్ ఆదేశాల మేరకు ఆదిలాబాద్ జిల్లా మాదిగ జాగృతి సంఘం ఆధ్వర్యంలో జైనథ్ మండల సమీక్షా సమావేశాన్ని ఆదివారం నిర్వహించారు. సంఘం బలోపేతం, జాతి ఐక్యత, సామాజిక చైతన్యంపై సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. ప్రతి గ్రామంలో గ్రామ కమిటీలను ఏర్పాటు చేసి సంఘాన్ని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. అలాగే మహారాజుల కాలనీ బోర్డులకు నూతనంగా రంగులు వేసి తిరిగి ప్రారంభించాలని నిర్ణయించారు. గ్రామాల్లో ‘జ్ఞాన దీపారాధన’, ‘గృహ దర్శనాలు’ నిర్వహిస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని సూచించారు. మాదిగ జాతి ఐక్యత, హక్కుల సాధన కోసం ప్రతి ఒక్కరూ సమష్టిగా కృషి చేయాలని నాయకులు కోరారు.

సమావేశంలో రాష్ట్ర నాయకులు అన్నెల అడేళ్లు మహారాజ్‌తో పాటు జిల్లా నాయకులు బొర్ర నగేష్ మహారాజ్, అశ్విని మహారాణి, రాచర్ల నారాయణ మహారాజ్, అవుసం దేవన్న మహారాజ్ పాల్గొన్నారు. మండల నాయకులు బండారి సంతోష్, బట్టు నరేష్, బిక్కి పోచన్న, బిక్కి దత్తు, కోడిచర్ల గంగన్న, కురె అశోక్, కోడిచర్ల ప్రశాంత్, అవుసం దేవన్న, కోడిచర్ల లస్మన్న, గొంటిముకుల నవనీత్, సాయికృష్ణ, ప్రవీణ్, గుమ్మడి దేవన్నతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.