Chitram news
Newspaper Banner
Date of Publish : 18 September 2026, 7:42 pm Editor : Chitram news

“జాతీయ మానవ హక్కులు, నేర నియంత్రణ మండలి” తెలంగాణ రాష్ట్ర చైర్మన్ గా డా.వేముగంటి వరప్రసాదరావు 

“జాతీయ మానవ హక్కులు, నేర నియంత్రణ మండలి” తెలంగాణ రాష్ట్ర చైర్మన్ గా డా.వేముగంటి వరప్రసాదరావు 

చిత్రం న్యూస్, బేల: నిస్వార్థ సమాజ సేవలో గత 10 ఏళ్లుగా ముందుకు సాగుతున్న డా. వేముగంటి వరప్రసాదరావుకు రాష్ట్రస్థాయి గుర్తింపు లభించింది. భారత కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ గుర్తింపు పొందిన స్వచ్ఛంద సంస్థ “జాతీయ మానవ హక్కులు, నేర నియంత్రణ మండలి” తెలంగాణ రాష్ట్ర చైర్మన్‌గా ఆయన నియమితులయ్యారు. ఈ సందర్భంగా డా.వరప్రసాదరావు మాట్లాడుతూ.. వివిధ స్వచ్ఛంద సంస్థల ద్వారా ఎలాంటి స్వార్థ ప్రయోజనాలు లేకుండా అవినీతి రహిత సేవ చేస్తున్న తనకు రాష్ట్ర గుర్తింపు రావడం గొప్ప బాధ్యతగా భావిస్తున్నానని, తన వంతుగా నిస్వార్థంగా సేవలందిస్తానని తెలిపారు. ఈ పదవి ఉద్యోగం కాదని, పూర్తిగా సేవా భావంతో చేసే బాధ్యత అని స్పష్టం చేశారు. సంస్థ ముఖ్య ఉద్దేశం నేరాలను అరికట్టడం, మానవ హక్కుల పరిరక్షణ అని పేర్కొన్నారు. ఉత్తర తెలంగాణలో అరుదైన ఉన్నత విద్యా డిగ్రీలు కలిగిన డా. వరప్రసాదరావు ఆదిలాబాద్ జిల్లా బేలలోని కీర్తన డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌గా సేవలందిస్తున్నారు. ఆయన స్వగ్రామం కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం తాడికల్.