ఏఐసీసీ సెక్రటరీ సచిన్ సావంత్ కు ఘన స్వాగతం పలికిన దుర్గం శేఖర్
చిత్రం న్యూస్,ఆదిలాబాద్: ఆదిలాబాద్ నియోజకవర్గ పరిధిలో రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ సంఘటన్ (RGPRS) ఆధ్వర్యంలో నిర్వహించిన సర్పంచుల శిక్షణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఏఐసీసీ సెక్రటరీ సచిన్ సావంత్ కు ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా టీపీసీసీ ఎస్సీ డిపార్ట్‌మెంట్ వైస్ చైర్మన్ దుర్గం శేఖర్ సచిన్ సావంత్ ను శాలువాతో సత్కరించి స్వాగతించారు. గ్రామీణ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు శిక్షణ, పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతం వంటి అంశాలపై కార్యక్రమంలో చర్చించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గోపిడి రుక్మారెడ్డి, మినాజ్, డీసీసీ ఎస్సీ డిపార్ట్‌మెంట్ అధ్యక్షులు పరమేశ్వర్, మీడియా కోఆర్డినేటర్ మేకల జితేందర్ తదితరులు పాల్గొన్నారు.