Chitram news
Newspaper Banner
Date of Publish : 18 September 2026, 5:59 pm Editor : Chitram news

గూడలో ఇందిరమ్మ ఇంటికి భూమిపూజ

గూడలో ఇందిరమ్మ ఇంటికి భూమిపూజ

చిత్రం న్యూస్, భోరజ్: భోరజ్ మండల పరిధిలోని గూడ గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు నిర్మాణానికి శుక్రవారం ఘనంగా భూమిపూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆత్మ కమిటీ చైర్మన్ గిమ్మ సంతోష్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గ్రామంలోని లబ్ధిదారుల సమక్షంలో ఆయన సాంప్రదాయబద్ధంగా కొబ్బరికాయ కొట్టి, భూమి పూజ చేసి పనులను అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల సొంతింటి కలను నిజం చేసేందుకే ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోందని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఈ పథకం వర్తిస్తుందని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో భోరజ్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు శాంతన్ రావ్, కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు, గూడ గ్రామ ప్రజలు పాల్గొన్నారు.