Chitram news
Newspaper Banner
Date of Publish : 18 September 2026, 5:45 pm Editor : Chitram news

హాకీ శిక్షణకు ఎంపికైన బరంపూర్ విద్యార్థినులకు ఘన సన్మానం

హాకీ శిక్షణకు ఎంపికైన బరంపూర్ విద్యార్థినులకు ఘన సన్మానం

చిత్రం న్యూస్,తలమడుగు: మండలంలోని బరంపూర్ ఉన్నత పాఠశాలకు చెందిన 8, 9 తరగతుల విద్యార్థినులు హైదరాబాద్‌లో హాకీ శిక్షణకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా పాఠశాలలో జిల్లా హాకీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా క్రీడా అధికారి పార్థసారథి, జిల్లా ఒలింపిక్స్ క్రీడా అధ్యక్షుడు బాలూరి గోవర్ధన్ రెడ్డి, యూనిస్, సామాజిక కార్యకర్త మౌనిష్ రెడ్డి విద్యార్థినులను, పీఈటీ రవిని సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దేవురావు, ఉప సర్పంచ్ రంజిత్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి అనిల్ రెడ్డి, రమాకాంత్, పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.