భైంసాలో గోమాతలకు ఘనంగా మహిళల హారతి
చిత్రం న్యూస్, బాసర : నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని గోశాల ప్రాంగణంలో గోమాతలకు ఘనంగా మహా హారతి, ప్రత్యేక పూజ నిర్వహించారు. గోశాల కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో మహిళలు, స్థానిక భక్తులు, హిందూ బంధువులు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తిశ్రద్ధలతో గోమాతలకు హారతులు ఇచ్చారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ..హిందూ సంస్కృతిలో గోమాతకు ఎంతో విశిష్ట స్థానం ఉందని, గోవులను సంరక్షించడం, పూజించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. కార్యక్రమానికి విచ్చేసిన భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో , గోసేవకులు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు.