Chitram news
Newspaper Banner
Date of Publish : 17 September 2026, 4:13 pm Editor : Chitram news

వైభవంగా విశ్వకర్మ జయంతి వేడుకలు 

వైభవంగా విశ్వకర్మ జయంతి వేడుకలు 

చిత్రం న్యూస్, బేల: విశ్వకర్మ భగవాన్ జయంతి వేడుకలను విశ్వకర్మ మరాఠీ వడ్రంగి సంఘం ఆధ్వర్యంలో వేడుకలను ఆదిలాబాద్ లో  గురువారం ఘనంగా నిర్వహించారు. స్థానిక సెంట్రల్ గార్డెన్లో భగవాన్ శ్రీ విశ్వకర్మ విగ్రహాన్ని ప్రతిష్టించి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి భక్తిశ్రద్ధలతో ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులు జాన్వె సంతోష్ మాట్లాడుతూ.. నైపుణ్యం, శ్రమ, సృజనాత్మకతకు విశ్వకర్మ భగవాన్ ప్రతీక అని పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు దిలీప్, నాగోరావ్, వెంకట్,నవీన్, అనిల్, ప్రమోద్, ఇస్తారి, పుండాలిక్, విలాస్, మహేందర్, గోవర్దన్, దశరథ్, సమాజ పెద్దలు, యువత, మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.