Chitram news
Newspaper Banner
Date of Publish : 15 September 2026, 8:19 pm Editor : Chitram news

బెల్లూరిలో  సామూహిక హనుమాన్ చాలీసా పారాయణము

బెల్లూరిలో సామూహిక హనుమాన్ చాలీసా పారాయణము

చిత్రం న్యూస్, జైనథ్: మండలంలోని బెల్లూరి గ్రామంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు మంగళవారం సాయంత్రం గణనాథుడికి నిర్వహించిన ప్రత్యేక హారతి కార్యక్రమంలో గ్రామస్తులంతా ఒకచోటికి చేరారు. ఈ సందర్భంగా భక్తులు, గ్రామస్తులు సామూహికంగా హనుమాన్ చాలీసా పారాయణము చేశారు. భక్తి శ్రద్ధలతో సాగిన ఈ పారాయణంతో గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం సంతరించుకుంది. లంబోదరుడి దర్శనానికి వచ్చిన భక్తులకు పూజా కార్యక్రమాల అనంతరం తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.