Chitram news
Newspaper Banner
Date of Publish : 15 September 2026, 8:08 pm Editor : Chitram news

బోథ్ నియోజకవర్గ సర్పంచుల RGPRS శిక్షణను విజయవంతం చేయాలి: డీసీసీ అధ్యక్షుడు నరేష్ జాదవ్

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: బోథ్ నియోజకవర్గ సర్పంచుల ఏఐసీసీ RGPRS శిక్షణ కార్యక్రమాన్ని (దిశా నిర్దేశం) విజయవంతం చేయాలని డీసీసీ అధ్యక్షుడు నరేష్ జాదవ్ పిలుపునిచ్చారు. సోమవారం ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 17న ఇచ్చోడ మండల కేంద్రంలోని కుంట గంగారెడ్డి గార్డెన్‌లో ఈ శిక్షణ కార్యక్రమం జరగనుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి ఏఐసీసీ సెక్రటరీ సచిన్ సావంత్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరవుతారని చెప్పారు. బోథ్ నియోజకవర్గ పరిధిలోని కాంగ్రెస్ సర్పంచులు, ప్రజాప్రతినిధులు, మండల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.

ఘనంగా మహిళా కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం

జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో అఖిల భారత మహిళా కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మహిళా నాయకులకు శాలువాలు కప్పి, స్వీట్లు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ డీసీసీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్, టౌన్ ప్రెసిడెంట్ కిజార్ పాషా, మహిళా కాంగ్రెస్ నాయకురాలు అన్నపూర్ణ, మంచికట్ల ఆశమ్మ, ఓబీసీ అధ్యక్షుడు అంబంటి అశోక్, డీసీసీ ఆఫీస్ ఇంచార్జి బెజ్జంకి అనిల్, ప్రధాన కార్యదర్శి గౌలి సంజయ్, నాగేష్, మందాకిని, షబానా, ఎస్సీ డిపార్ట్‌మెంట్ చైర్మన్ పరమేశ్వర్, సోషల్ మీడియా కోఆర్డినేటర్ మేకల జితేందర్, వార్డు ప్రెసిడెంట్లు రాధేశ్యామ్, పూసం ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.