ఆదిలాబాద్ లో 52 అడుగుల భారీ గణనాథుడు
ఆదిలాబాద్ లో 52 అడుగుల భారీ గణనాథుడు చిత్రం న్యూస్, ఆదిలాబాద్ ఆదిలాబాద్ పట్టణంలో కుమార్ జనతా గణేశ్ మండలి ఆధ్వర్యంలో 52 అడుగుల భారీ వినాయక విగ్రహాన్ని ప్రతిష్టించారు. హైదరాబాద్ నగరంలోని ఖైరతాబాద్ వినాయకుడి తర్వాత అంత ఘనంగా ఆదిలాబాద్ జిల్లాలో ఇక్కడ పూజలు నిర్వహిస్తారు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ మంగళవారం భారీ వినాయక విగ్రహాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. లంభోదరుడిని చూసేందుకు జిల్లా నలుమూలల నుంచి ప్రజలు భారీగా తరలివస్తున్నారు.