291వ వారానికి చేరిన సంగెం ట్రస్ట్ అన్నదాన కార్యక్రమం
చిత్రం న్యూస్, ఆదిలాబాద్: డా.సుధీర్ కుమార్ న్యాయవాది, సంగెం చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్నదాన మహాయజ్ఞం 291వ వారానికి చేరింది. కరోనా కష్టకాలం నుండి తన తల్లి సంగెం గిర్మాబాయి పేరు మీద పేద ప్రజలకు ప్రతి ఆదివారం అన్నదానం చేస్తున్నారు. ఈ వారం అన్నదాన కార్యక్రమానికి స్పెషల్ గెస్ట్‌గా హెడ్ కానిస్టేబుల్ పంభాల లింగమూర్తి హాజరయ్యారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు బొమ్మెత సుభాష్, భీమాకంటి అంబయ్య, డోంగరి గంగయ్య, సలీం, మహేందర్ రెడ్డి, నరేందర్ న్యాయవాది, రాజయ్య కేశవేణి తదితరులు పాల్గొన్నారు.