Chitram news
Newspaper Banner
Date of Publish : 11 September 2026, 5:24 pm Editor : Chitram news

ప్రధానోపాధ్యాయులు సతీష్ గుర్నూలేకు నివాళి 

ప్రధానోపాధ్యాయులు సతీష్ గుర్నూలేకు నివాళి 

చిత్రం న్యూస్,బేల: ఇటీవల గుండెపోటుతో హఠాన్మరణం చెందిన ఖోగ్దూర్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సతీష్ గుర్నూలేకు శుక్రవారం నివాళులర్పించారు. బేల ఉన్నత పాఠశాలలో మండల విద్యాధికారి మహాలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించిన సంతాప సభలో, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొని సతీష్ గుర్నూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన విద్యారంగానికి అందించిన సేవలను, విద్యార్థుల అభ్యున్నతికి చేసిన కృషిని స్మరించుకున్నారు. సతీష్ గుర్నూలే అకాల మరణం విద్యారంగానికి, ఉపాధ్యాయ సమాజానికి తీరని లోటని పలువురు పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాలు మౌనం పాటించారు. కార్యక్రమంలో కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు కృష్ణకుమార్, రమేష్ మోహన్ రెడ్డి, ఉపాధ్యాయులు, ఎమ్మార్సీ సిబ్బంది పాల్గొన్నారు.