Chitram news
Newspaper Banner
Date of Publish : 11 September 2026, 1:48 pm Editor : Chitram news

​ఫసల్ బీమా యోజన తక్షణ అమలుకు డిమాండ్: బీజేఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పాయల్ శంకర్

బీజేఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్,ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ పాయల్ శంకర్ ఆధ్వర్యంలో బీజేపీ ఎమ్మెల్యేల ట్రాక్టర్ ర్యాలీ

చిత్రం న్యూస్, హైదరాబాద్:ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన’ను రాష్ట్రంలో వెంటనే పునరుద్ధరించి, నష్టపోయిన ప్రతీ రైతుకూ పరిహారం అందించాలని బీజేఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ డిమాండ్ చేశారు. ఆయన ఆధ్వర్యంలో బీజేపీ ఎమ్మెల్యేలు పాల్వాయి హరీష్ బాబు, పవార్ రామారావు పాటిల్, పైడి రాకేష్ రెడ్డిలతో కలిసి ఎమ్మెల్యే క్వార్టర్స్ నుండి గన్ పార్క్ మీదుగా అసెంబ్లీ వరకు భారీ ట్రాక్టర్ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సంధర్బంగా మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన రూ. 2 లక్షల రుణమాఫీ హామీ నెరవేరలేదని, అర్హులైన ప్రతి రైతుకూ వెంటనే సంపూర్ణ రుణమాఫీతో పాటు పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని పాయల్ శంకర్ స్పష్టం చేశారు. గన్ పార్క్ నుండి అసెంబ్లీకి వెళ్తున్న ఎమ్మెల్యేల ట్రాక్టర్లను గేటు వద్దే నిలువరించడంపై తీవ్ర నిరసన చేపట్టారు. పోలీసుల అడ్డంకిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల గళాన్ని నొక్కడం ప్రభుత్వానికి సాధ్యం కాదని హెచ్చరించారు. శాసనసభ వేదికగా రైతుల సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగడతామని పేర్కొన్నారు.