Chitram news
Newspaper Banner
Date of Publish : 10 September 2026, 4:54 pm Editor : Chitram news

ఎన్‌ఎస్‌యూఐ నిర్మల్ జిల్లా అధ్యక్షుడిగా జంగం శశిధర్ 

ఎన్‌ఎస్‌యూఐ నిర్మల్ జిల్లా అధ్యక్షుడిగా జంగం శశిధర్ 

చిత్రం న్యూస్ బాసర : నిర్మల్ జిల్లా ఎన్‌ఎస్‌యూఐ నిర్మల్ జిల్లా అధ్యక్షుడిగా జంగం శశిధర్ నియమితులయ్యారు. హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో జరిగిన కార్యక్రమంలో ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షులు యడవల్లి వెంకట స్వామి, జాతీయ లీగల్ సెల్ కన్వీనర్ ఎం.డి. అక్బర్, అరవింద్ కుమార్ యాదవ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుల సమక్షంలో జంగం శశిధర్‌కు నియామక ఉత్తర్వులు అందజేశారు. ఈ సందర్భంగా జంగం శశిధర్‌ను నాయకులు ఘనంగా సన్మానించి, పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. నిర్మల్ జిల్లాలో ఎన్‌ఎస్‌యూఐని మరింత బలోపేతం చేసి, విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని నాయకులు ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా జంగం శశిధర్ మాట్లాడుతూ..తనపై నమ్మకం ఉంచి నిర్మల్ జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర మరియు జాతీయ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థుల హక్కుల కోసం నిరంతరం పోరాడుతూ, జిల్లాలోని విద్యార్థుల సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, విద్యార్థి నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొని జంగం శశిధర్‌కు అభినందనలు తెలిపారు.