Chitram news
Newspaper Banner
Date of Publish : 10 September 2026, 1:45 pm Editor : Chitram news

NSUI రాష్ట్ర కార్యదర్శిగా సూద్దోళ్ల గంగప్రసాద్

* అతి చిన్న వయసులోనే  వరించిన రాష్ట్ర స్థాయి పదవి  

చిత్రం న్యూస్ బాసరవిద్యార్థుల పక్షాన నిరంతరం పోరాడే నిర్మల్ జిల్లా బాసర గ్రామానికి చెందిన యువ నాయకుడు సూద్దోళ్ల గంగప్రసాద్‌కు రాష్ట్ర స్థాయిలో కీలక బాధ్యతలు దక్కాయి. ప్రతిష్టాత్మక విద్యార్థి సంఘం అయిన NSUI (నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా) ఆయనను రాష్ట్ర కార్యదర్శిగా (స్టేట్ సెక్రటరీ) నియమించింది. ఒక సాధారణ కార్యకర్తగా, మండల స్థాయి నాయకుడిగా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన గంగప్రసాద్.. విద్యార్థుల సమస్యలపై ఎల్లప్పుడూ గళం విప్పుతూ, రాజీలేని పోరాటాలు చేస్తూ అంచెలంచెలుగా ఎదిగారు. అతి చిన్న వయసులోనే రాష్ట్ర స్థాయి నాయకుడిగా గుర్తింపు పొందడం ఆయన నాయకత్వ లక్షణాలకు, అంకితభావానికి నిదర్శనం.

డీసీసీ ఉపాధ్యక్షులు మమ్మాయి రమేష్ కు కృతజ్ఞతలు

ఒక సాధారణ కార్యకర్త స్థాయి నుంచి తాను ఈ రోజు రాష్ట్ర స్థాయికి ఎదగడంలో నిరంతరం వెన్నంటి ఉండి, తనను ఎంతగానో ప్రోత్సహించి సహకరించిన డీసీసీ (DCC) ఉపాధ్యక్షులు శ్రీ మమ్మాయి రమేష్ కు ఈ సందర్భంగా గంగప్రసాద్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఆయన మార్గదర్శకత్వంలో విద్యార్థుల సమస్యల పరిష్కారానికి మరింత కృషి చేస్తానని పేర్కొన్నారు.