BRS పార్టీ డైవర్షన్ పాలిటిక్స్ మానుకోవాలి – DCC వైస్ ప్రెసిడెంట్ మమ్మాయి రమేష్
చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా బాసర మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద కాంగ్రెస్ పార్టీ DCC వైస్ ప్రెసిడెంట్ మమ్మాయి రమేష్,ఆధ్వర్యంలో BRS పార్టీ తీరుకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మమ్మాయి రమేష్ మాట్లాడుతూ.. గత పదేళ్లలో BRS ప్రజలకు చేసిందేమి లేదని, మళ్ళీ ప్రజలను మోసం చేయడానికి KTR, హరీష్ రావులు జిమ్మిక్కులు చేస్తున్నారని తీవ్రంగా విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కి పోలీసుల చొక్కాలు పట్టుకోవడం, దళిత శాసనసభ స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడం సభ్య సమాజం తలదించుకునేలా చేసిందన్నారు.
వేయి రోజులకు పైగా ప్రతిపక్ష నేతగా ఉంటూ అసెంబ్లీకి రాకుండా ఉండటం KCR రాచరిక పాలనకు నిదర్శనమని అన్నారు. KCR అసెంబ్లీకి రావాలని ఒత్తిడి తెస్తున్న ప్రజా ప్రభుత్వాన్ని పక్కదోవ పట్టించడానికి ఇలా డైవర్షన్ పాలిటిక్స్ చేయడం సబబు కాదన్నారు. BRS పార్టీ చేస్తున్న ఇటువంటి చర్యలను బాసర మండల కాంగ్రెస్ తరపున తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సంజీవరావు దేశముఖ్, శ్రీను పటేల్, జంగం రాజేందర్, ఖలీల్, బాశెట్టి శ్యామ్, నానం నర్సయ్య, జలీల్, హైమద్, మూస, శంకర్, అల్లం అనిల్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.