Chitram news
Newspaper Banner
Date of Publish : 08 September 2026, 8:50 am Editor : Chitram news

 ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత మెస్రం నాగేశ్వర్ రావుకు సన్మానం 

 ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత మెస్రం నాగేశ్వర్ రావుకు సన్మానం 

చిత్రం న్యూస్, జైనథ్: విద్యాబోధనలో విశేష సేవలు అందిస్తూ ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల పురోగతికి కృషి చేస్తున్న జైనథ్ గ్రామానికి చెందిన మెస్రం నాగేశ్వర్ రావు కు ‘ జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు’ లభించింది. జిల్లా కలెక్టర్ రాజర్షి షా, మార్కెట్ కమిటీ ఛైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి, డీవైఎస్ఓ దయానంద్ రెడ్డి తదితరులు పూలమాల, శాలువాతో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా స్థానిక నాయకులు, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు. వారి సేవలను కొనియాడారు.  సామజిక సమరసత జిల్లా ప్రధాన కార్యదర్శి సామ రమేష్ రెడ్డి, సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు