Chitram news
Newspaper Banner
Date of Publish : 07 September 2026, 9:33 pm Editor : Chitram news

ఇందిరమ్మ ఇల్లు ప్రారంభించిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎల్టి అశోక్ రెడ్డి 

ఇందిరమ్మ ఇల్లు ప్రారంభించిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎల్టి అశోక్ రెడ్డి 

చిత్రం న్యూస్, భోరజ్ :  ఆదిలాబాద్ జిల్లా భోరజ్  మండలం పెందల్వాడ గ్రామంలో  పావడే సునీత-రాజుకు మంజూరైన ఇందిరమ్మ ఇల్లును బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎల్టి అశోక్ రెడ్డి, వార్డు సభ్యుడు చుక్కబొట్ల సతీష్, మాజీ ఉప సర్పంచి నాగుల సంపూర్ణ నరేష్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎల్టి అశోక్ రెడ్డి మాట్లాడుతూ.. ఆదిలాబాద్ ఎమ్మెల్యే  పాయల్ శంకర్ చొరవతో పేదవాడి  సొంతింటి కల నెరవేరిందన్నారు. మున్ముందు మరిన్ని ఇండ్లు మంజూరు చేసి నిరుపేదలందరికీ గూడు కట్టిస్తామని ఆయన పేర్కొన్నారు. అనంతరం ఇందిరమ్మ లబ్ధిదారు సునీత రాజు దంపతులను శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో  వార్డు సభ్యులు బావునే రవి, జక్కుల స్వామి, చుక్కబొట్ల ఆకాష్, అందె మార్కొండి, నాయకులు  సామ ఉల్లాస్ రెడ్డి, పందిరి అశోక్, బోర్కర్ అనిల్, తకిట్ సుభాష్, పాద్రే రాజు, వైద్య సంజయ్, మెస్రం పవన్, ద్యావర్తి అశోక్, ఏడేడ్ల శ్రీకాంత్  తదితరులు పాల్గొన్నారు.