Chitram news
Newspaper Banner
Date of Publish : 07 September 2026, 8:58 pm Editor : Chitram news

స్కావెంజర్ల పెండింగ్ వేతనాలు చెల్లించాలి – సీఐటీయూ ధర్నా

స్కావెంజర్ల పెండింగ్ వేతనాలు చెల్లించాలి – సీఐటీయూ ధర్నా

చిత్రం న్యూస్,ఆదిలాబాద్: స్కూల్ స్కావెంజర్ల పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించి, వారి సమస్యలను పరిష్కరించాలని సిఐటియు జిల్లా కార్యదర్శి కిరణ్ డిమాండ్ చేశారు. సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ (CITU) ఆధ్వర్యంలో ఆదివారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం అదనపు కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. స్కావెంజర్లకు ఉద్యోగ భద్రత కల్పించి గుర్తింపు కార్డులు ఇవ్వాలని, ఇన్సూరెన్స్, పదవీ విరమణ సౌకర్యాలు కల్పించాలని కోరారు. స్కావెంజర్ల సమస్యలపై ప్రభుత్వం చర్చించి పరిష్కరించాలని డిమాండ్ చేశారు.ఈ ధర్నాలో ఓం గణేష్, మైకుల్కర్ కిషన్, నాగన్న తదితరులు పాల్గొన్నారు.