Chitram news
Newspaper Banner
Date of Publish : 07 September 2026, 8:03 pm Editor : Chitram news

భారత్ జోడో యాత్రకు 4 ఏళ్లు 

భారత్ జోడో యాత్రకు 4 ఏళ్లు 

గాంధీభవన్‌లో జరిగిన సంబరాలలో పాల్గొన్న దుర్గం శేఖర్, నరేష్  జాదవ్

చిత్రం న్యూస్, హైదరాబాద్: రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర 4 ఏళ్లు పూర్తి చేసుకుని 5వ ఏట అడుగుపెట్టిన సందర్భంగా గాంధీభవన్‌లో సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ఏఐసీసీ సెక్రటరీ సచిన్ సావంత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆదిలాబాద్ డీసీసీ అధ్యక్షులు డా. నరేష్ జాదవ్, ఏఐసీసీ ఆదివాసీ విభాగం ఉపాధ్యక్షులు బెల్లయ్య నాయక్, పీసీసీ ఎస్సీ డిపార్ట్‌మెంట్ వైస్ ప్రెసిడెంట్ దుర్గం శేఖర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, భారత్ జోడో యాత్ర దేశ రాజకీయాల్లో చారిత్రాత్మక మలుపు అని, ఇది రాజకీయ యాత్ర కాదు దేశాన్ని ఐక్యం చేసే ఉద్యమమని అన్నారు. రాహుల్ గాంధీ స్ఫూర్తితో ప్రజాస్వామ్య పరిరక్షణ, సామాజిక న్యాయం కోసం ప్రతి కార్యకర్త పని చేయాలని పిలుపునిచ్చారు.