జైనథ్ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ రాముకు ఘన సన్మానం
చిత్రం న్యూస్, జైనథ్: విద్యాబోధనలో విశేష సేవలు అందిస్తూ, పాఠశాల పురోగతికి కృషి చేస్తున్న జైనథ్ ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్ రాము కు రాష్ట్రస్థాయి ‘ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు’ లభించింది. ఈ సందర్భంగా స్థానిక నాయకులు, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు. సోమవారం పాఠశాలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రిన్సిపాల్ రాము ను శాలువాతో ఘనంగా సన్మానించి, వారి సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో జైనథ్ గ్రామ సర్పంచ్ గడ్డం మమత జగదీష్ రెడ్డి, ఉప సర్పంచ్ పిడుగు సంతోష్ యాదవ్, స్థానిక నాయకులు అల్లూరి అశోక్ రెడ్డి, అడ్డి రూకేష్ రెడ్డి, సారథి, చిలుకూరి లింగారెడ్డి, పరశురామ్, వార్డ్ మెంబర్లు తదితరులు పాల్గొన్నారు.