బాసరలో రూ.20 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి జూపల్లి కృష్ణారావు
బాసరలో రూ.20 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి జూపల్లి కృష్ణారావు చిత్రం న్యూస్ బాసర : ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదివారం దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న మంత్రికి అధికారులు, అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు అనంతరం వేదపండితులు ఆశీర్వచనం చేయగా, అధికారులు అమ్మవారి శేషవస్త్రం, తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం గోదావరి బాసర ఘాట్...