Chitram news
Newspaper Banner
Date of Publish : 06 September 2026, 3:16 pm Editor : Chitram news

కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల పాలనపై బాసరలో బీఆర్ఎస్ పార్టీ నేతల నిరసన 

కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల పాలనపై బాసరలో బీఆర్ఎస్ పార్టీ నేతల నిరసన 

చిత్రం న్యూస్ బాసర : కాంగ్రెస్‌ ప్రభుత్వ 1000 రోజుల పాలనపై నిర్మల్ జిల్లా ముథోల్ నియోజకవర్గం బాసర మండలం లాబ్ది గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకురాలు డాక్టర్ పడకంటి రమాదేవి ఆధ్వర్యంలో గ్రామంలో పరిసరాల పరిశుభ్రతను చేపట్టి తమ నిరసనను తెలిపారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 1000 రోజులు పూర్తవుతున్నా ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీల్లో చాలా వరకు అమలు కాలేదని బీఆర్ఎస్ పార్టీ నాయకులు మండిపడ్డారు. మోసపు హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించాలి అంటూ బీఆర్ఎస్ నాయకులు,కార్యకర్తలు నినాదాలుచేశారు. యువత, విద్యార్థుల హక్కుల పరిరక్షణ, వారి సమస్యలపై ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడమే లక్ష్యమని పేర్కొన్నారు.