Chitram news
Newspaper Banner
Date of Publish : 04 September 2026, 6:35 pm Editor : Chitram news

కాంగ్రెస్ వైఫల్యాలపై బాసరలో  బీఆర్ఎస్ నిరసన

కాంగ్రెస్ వైఫల్యాలపై బాసరలో  బీఆర్ఎస్ నిరసన

*ఇచ్చిన 420 హామీలు నెరవేర్చలేదని భారీ బహిరంగ ర్యాలీ 

​చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా బాసర మండల కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో తీవ్రంగా విఫలమైందని ఆరోపిస్తూ బాసర పుణ్యక్షేత్రంలో భారీ బహిరంగ ర్యాలీ నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన 420 హామీలు, ఆరు గ్యారంటీలు అమలుకాకుండా ప్రకటనలకే పరిమితమయ్యాయని ఆందోళనకారులు మండిపడ్డారు. ఈ ర్యాలీలో సమన్వయకర్త కిరణ్ కొమ్రేవార్, శ్యాంసుందర్ , గద్దేకర్ విలాస్, బాసర మండల అధ్యక్షుడు శ్యామ్ ,పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొని ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు.

ప్రధాన డిమాండ్లు మరియు విమర్శలు

అమలుకాని హామీలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 హామీల్లో ఎక్కువ భాగం అమలుకు నోచుకోలేదని, ప్రజలను గాలికి వదిలేశారని విమర్శించారు. రైతులు, నిరుద్యోగుల మోసం, రైతు భరోసా, రుణమాఫీ, నిరుద్యోగ భృతి, మహిళలకు ఉచిత పథకాల అమలులో ప్రభుత్వం కాలయాపన చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాకీ కార్డుల పంపిణీ అమలు కాకుండా మిగిలిపోయిన హామీలను వివరిస్తూ ప్రజలకు బాకీ కార్డులను పంపిణీ చేశారు. ​ఉద్యమం ఇక్కడితో ఆగదని, ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రతి ఒక్క హామీని నెరవేర్చే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని నాయకులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద కప్ గంగాధర్, రవి మంతెన పోశెట్టి ,జాజోళ్ల రాజు, జాజోళ్ల అశోక్, శివన్న తదితరులు పాల్గొన్నారు.