డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన సందర్భంగా రక్తదాన శిబిరం
చిత్రం న్యూస్, బాసర: జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని నిర్మల్ జిల్లా బాసర మండలంలోని జనసేన యువకులు, అభిమానులు ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పెద్ద ఎత్తున రక్తదాన శిబిరం నిర్వహించి మానవత్వాన్ని చాటుకున్నారు.ఈ సందర్భంగా మారుతి పటేల్ రాజు మాట్లాడుతూ.. పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. రక్తదాన శిబిరం నిర్వహించడంతో పాటు పేదలకు వస్త్రాలు,అవసరమైన సామగ్రిని అందించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ అభిమానులు తదితరులు పాల్గొన్నారు.