కేఆర్కే కాలనీలో నూతన విద్యుత్ స్తంభాల ఏర్పాటు
కేఆర్కే కాలనీలో నూతన విద్యుత్ స్తంభాల ఏర్పాటు చిత్రం న్యూస్, ఆదిలాబాద్: పట్టణంలోని కేఆర్కే కాలనీలో సోమవారం ప్రజల చిరకాల కోరిక నెరవేరింది. గత కొంతకాలంగా విద్యుత్ సమస్యలతో ఇబ్బంది పడుతున్న ప్రజల కోసం అధికారులు నూతన విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేశారు. పాత స్తంభాలు శిథిలావస్థకు చేరడం, వైర్లు కిందికి వేలాడుతుండటంతో స్థానికులు ప్రమాదాల భయంతో గడిపేవారు. ఈ సమస్యపై స్పందించిన విద్యుత్ శాఖ అధికారులు, స్థానిక కేఆర్కే కాలనీ కౌన్సిలర్ దుమ్మని రజిత రాము,...