కేఆర్కే కాలనీలో నూతన విద్యుత్ స్తంభాల ఏర్పాటు
చిత్రం న్యూస్, ఆదిలాబాద్: పట్టణంలోని కేఆర్కే కాలనీలో సోమవారం ప్రజల చిరకాల కోరిక నెరవేరింది. గత కొంతకాలంగా విద్యుత్ సమస్యలతో ఇబ్బంది పడుతున్న ప్రజల కోసం అధికారులు నూతన విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేశారు. పాత స్తంభాలు శిథిలావస్థకు చేరడం, వైర్లు కిందికి వేలాడుతుండటంతో స్థానికులు ప్రమాదాల భయంతో గడిపేవారు. ఈ సమస్యపై స్పందించిన విద్యుత్ శాఖ అధికారులు, స్థానిక కేఆర్కే కాలనీ కౌన్సిలర్ దుమ్మని రజిత రాము, ప్రజాప్రతినిధుల సహకారంతో కొత్త స్తంభాలను మంజూరు చేశారు. సోమవారం ఉదయం కొత్త సిమెంట్ స్తంభాలను ఏర్పాటుచేసి, వాటికి కొత్త విద్యుత్ వైర్లను అమర్చారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ రజిత రాము మాట్లాడుతూ.. కొత్త స్తంభాల ఏర్పాటుతో తమకు మా కాలనీవాసులకు లో-వోల్టేజ్ సమస్యలు, విద్యుత్ అంతరాయాలు తగ్గుతాయని ఆనందం వ్యక్తం చేశారు. త్వరితగతిన స్పందించి సమస్యను పరిష్కరించిన అధికారులకు, నాయకులకు వారు కృతజ్ఞతలు తెలిపారు.