బాధిత కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జి నారాయణ్ రావు పటేల్ పరామర్శ
చిత్రం న్యూస్, భైంసా: భైంసా పట్టణానికి చెందిన చిన్న స్వామి తల్లి అనారోగ్యంతో మృతి చెందారు. బాధిత కుటుంబాన్ని మాజీ శాసనసభ్యులు, కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జి భోంస్లే నారాయణ్ రావు పటేల్ శనివారం పరామర్శించారు. వారి ఇంటికి వెళ్లిన ఆయన కుటుంబీకులను ఓదార్చారు. ఆయన వెంట నాయకులు శంకర్ చందే, శ్యామ్ రావు పటేల్, బొజారం పటేల్, సాయినాథ్, మాధవ్ పటేల్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.