చేతి పంపును ప్రారంభించిన సర్పంచ్ క్యాతం పోచక్క సురేష్ రెడ్డి
చిత్రం న్యూస్, బేల: బేలమండలం సిర్సన్న గ్రామంలో బాల వికాస సంస్థ ఆధ్వర్యంలో బిగించిన చేతి పంపును గ్రామ సర్పంచ్ క్యాతం పోచక్క సురేష్ రెడ్డి, బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ దీపక్ గౌడ్, బాలవికాస కమిటీ సభ్యులు కాట్పెల్లి కిష్టారెడ్డి,కాడే రూపేష్, ఏముల భూమారెడ్డి, ఎల్టి కిష్టారెడ్డి, గ్రామ పెద్దలు కళ్ళెం మల్లారెడ్డి, బాలవికాస సంస్థ తరఫున ప్రశాంత్, ఏరియా కోఆర్డినేటర్ నరేందర్ మహిళలు తదితరులు పాల్గొన్నారు.